Donald Trump: ఉత్తరకొరియా నుంచి పారిపోయి అమెరికా వచ్చిన ఆరుగురు.. వారితో డొనాల్డ్ ట్రంప్ భేటీ

  • ఓవల్‌ ఆఫీస్‌లో వారికి స్వాగతం పలికిన ట్రంప్
  • ట్రంప్ చర్య ఉత్తర కొరియాను రెచ్చగొట్టే విధంగా ఉందంటోన్న విశ్లేషకులు
  • అంతకు ముందు దక్షిణ కొరియా అధ్యక్షుడి‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్

ఉత్తరకొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ తీరుగా మండిపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలోనూ ఉత్తరకొరియా తీరును ఎండగట్టారు. ఆ దేశం వల్ల అమెరికాకు ముప్పు ఉందని కూడా అన్నారు. కాగా, ఉత్తరకొరియా నుంచి పారిపోయి వచ్చిన ఆరుగురు శరణార్థులు అమెరికా అధ్యక్షుడి కార్యాలయమైన ఓవల్‌ ఆఫీస్‌కు వచ్చారు. వారికి ట్రంప్ స్వయంగా స్వాగతం పలకడం విశేషం.

దక్షిణ కొరియాలో శీతాకాల ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న సమయంలో ట్రంప్ ఇలా ప్రవర్తిచడం గమనార్హం. ట్రంప్ చర్య ఉత్తర కొరియాను రెచ్చగొట్టే విధంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకు ముందు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్..  ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘన గురించి కూడా చర్చించారు. 

More Telugu News