మణిరత్నం మూవీ నుంచి తప్పుకున్న హీరో

03-02-2018 Sat 16:39
  • త్వరలో సెట్స్ పైకి మణిరత్నం 
  • ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఫహాద్ ఫాజిల్ 
  • డేట్స్ సర్దుబాటు చేయలేకనే అనే టాక్
'చెలియా' సినిమా మణిరత్నం అభిమానులను నిరాశ పరిచింది. దాంతో కొత్తగా మరో కథను సిద్ధం చేసుకున్న మణిరత్నం,  ఈ నెల చివరిలో గానీ .. వచ్చేనెల మొదటివారంలో గాని సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇది భారీ తారాగణంతో రూపొందుతోన్న మల్టీ స్టారర్. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలకి గాను, కార్తీ .. శింబు .. విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ .. జ్యోతిక .. ఐశ్వర్య రాజేశ్ .. అదితీరావులను ఎంపిక చేసుకున్నారు.

 అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫహాద్ ఫాజిల్ తప్పుకోవడం కోలీవుడ్ లో చర్చనీయాంశమైంది. డేట్స్ సర్దుబాటు చేయలేకనే ఆయన ఈ ప్రాజెక్టును వదులుకున్నట్టు చెప్పుకుంటున్నారు. దాంతో ఆయన స్థానంలో మరో నటుడిని ఎంపిక చేసే పనిలో యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాకి, ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న విషయం తెలిసిందే.