nani: అలా నానిని ఈజీగా కలవగలిగాను: 'నిన్నుకోరి' దర్శకుడు

  • కథలు రెడీ చేసుకుని చాలామంది నిర్మాతలను కలిశాను
  • కోన వెంకట్ తో పరిచయం కలిగింది 
  • ఆయనే నాని దగ్గరికి తీసుకెళ్లారు   

వరుస విజయాలతో దూసుకుపోతోన్న నాని ఖాతాలోకి, 'నిన్నుకోరి' సినిమాతో మరో సక్సెస్ ను చేర్చాడు దర్శకుడు శివ నిర్వాణ. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, ఈ సినిమాకి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "ఈ సినిమా కథను నానికి చెప్పడానికి గాను ఆయనను కలుసుకోవడానికి పెద్దగా కష్టపడలేదు. కోన వెంకట్ గారి ద్వారా నానిని నేరుగా కలిసే అవకాశం కలిగింది" అన్నారు.

"అంతకుముందు నేను ఓ ఐదారు కథలను సిద్ధం చేసుకుని .. దాదాపు ఏడెనిమిది సంవత్సరాల పాటు ఎంతోమంది నిర్మాతలను కలిసి కథలు చెప్పాను. కోటి రూపాయల నుంచి 20 కోట్ల బడ్జెట్ వరకూ గల కథలను రెడీ చేసుకుని, ఆ స్థాయి నిర్మాతలను చాలామందిని కలిశాను. ఈ క్రమంలోనే షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి నన్ను కోన వెంకట్ గారికి పరిచయం చేశాడు. ఆయన నన్ను నానికి పరిచయం చేశాడు. గతంలో చాలా మంది నిర్మాతలను కలిసిన అనుభవం నానితో సినిమా చేయడానికి నాకు పనికొచ్చింది " అని చెప్పుకొచ్చారు.    

More Telugu News