Ulefone: యూల్‌ఫోన్ నుంచి 'హీలియో పీ70 ఆక్టాకోర్ ప్రాసెసర్' స్మార్ట్‌ఫోన్!

  • మార్కెట్లోకి 'యూల్‌ఫోన్ టి2 ప్రొ'
  • హీలియో పీ70 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్
  • ఈ నెల 26వ తేదీన 'ఎండబ్ల్యూసీ' లో ప్రదర్శన

హీలియో పీ70 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో ప్రపంచపు మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్ 'యూల్‌ఫోన్ టి2 ప్రొ' ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రముఖ మొబైల్స్ తయారీ దిగ్గజం యూల్‌ఫోన్ పేర్కొంది. బార్సిలోనాలో ఈ నెల 26 నుండి మార్చి 1వ తేదీ వరకు జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనలో దీన్ని లాంచ్ చేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే ఫోన్ ధర, ఫీచర్ల గురించి తెలియాలంటే ఈ ఫోన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

More Telugu News