alcohol: యూపీలో లిక్కర్ షాపుల్లోనూ స్వైపింగ్ యంత్రాలు... కార్డుతో కొనుగోళ్లు

  • క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు
  • ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
  • అధిక ధరకు విక్రయిస్తే గుర్తించేందుకు వీలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ కింద అన్ని లిక్కర్ షాపుల్లో స్వైపింగ్ యంత్రాలు పెట్టాలన్న నిబంధన ప్రవేశపెట్టింది. దీంతో మందు బాబులు క్రెడిట్, డెబిట్ కార్డులతో మందు కొనుగోలు చేసి తీసుకెళ్లే అవకాశం కలుగుతుంది. అలాగే, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా కూడా తమ ఖాతాల నుంచి లిక్కర్ షాపు ఖాతాలకు నగదు బదిలీ చేసుకునే వీలు కల్పించింది. దీనివల్ల రిటెయిల్ షాపులు గరిష్ట చిల్లర ధరకు మించి లిక్కర్ ను విక్రయిస్తే గుర్తించడం సులభం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కస్టమర్లకు క్రెడిట్, డెబిట్ కార్డు, ఈ పేమెంట్ విధానంలో లిక్కర్ కొనుగోలుకు వీలు కలుగుతుందని తెలిపారు.

More Telugu News