sharukh khan: నకిలీ పత్రాలతో స్ధలం కొనుగోలు చేసిన షారుఖ్... ఆదాయపుపన్ను శాఖ విచారణ!

  • ముంబై శివారు అలీబాగ్ లో 20,000 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో కొనుగోలు చేసిన షారుఖ్ ఖాన్
  • నిర్ధారించిన షారుఖ్ ఛార్టెడ్ అకౌంటెంట్
  • దానిపై సర్వహక్కులు కలిగి ఉన్న షారుఖ్

బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌ ను 20,000 గ‌జాల స్థలం తీవ్రఇబ్బందుల్లో పడేస్తోంది. ముంబై శివారు అలీబాగ్‌ లో 20,000 గజాల ప్లాట్స్‌ ను షారూఖ్ నకిలీ పత్రాలతో కొనుగోలు చేసినట్టు ఆయన సన్నిహితుడు, ఆయనకి ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ గా ఉంటున్న మోరేశ్వర్ అజ్గాంకరే ఆదాయపు పన్నుశాఖాధికారుల ముందు అంగీకరించాడు. వ్యవసాయం కోసం ఈ ఫ్లాట్స్ ను నకిలీ పత్రాలతో తీసుకున్న షారుఖ్.. ఆ స్థలంలో బీచ్, స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ హెలీప్యాడ్ తదితర సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన ఫామ్‌ హౌస్‌ నిర్మించాడు.

దీనికి తన బంధువుల్ని డైరెక్ట‌ర్లుగా నియ‌మించిన షారూఖ్, దీనిపై స‌ర్వాధికారాల్ని తానే క‌లిగి ఉన్నాడు. ఇవన్నీ తెలిసి ఐటీ డిపార్ట్ మెంట్ దాడులు నిర్వహించగా, షారుక్ సీఏ దానిని అంగీకరించాడు. దీంతో షారుఖ్ కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. కాగా, దీని విలువ 15 కోట్లుగా పేర్కొంటున్నప్పటికీ బహిరంగ మార్కెట్ లో దీని విలువ దీనికి ఐదు రెట్లు ఉంటుందని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈ నేరం రుజువైతే షారుఖ్ కు ఆరు నెలల నుంచి ఏడేళ్ల జైలు శిక్ష, ఆస్తిలో పదిశాతం జరిమానా పడే అవకాశం వుంది. ప్రస్తుతానికి ఈ ఫాం హౌస్ ను ఐటీ అధికారులు తాత్కాలికంగా అటాచ్ చేశారు. 

More Telugu News