bhadrachalam: భద్రాచలం ఆలయ తుది నమూనాలు పరిశీలించిన మంత్రి తుమ్మల

  • మూడు నమూనాలు కుదిరాయి
  • కేసీఆర్ సమక్షంలో తుది నిర్ణయం తీసుకుంటాం
  • వచ్చే శ్రీరామనవమి నాటికి ఆలయ అభివృద్ధికి తుదిరూపు కల్పిస్తాం : తుమ్మల

భద్రాచలం ఆలయ అభివృద్ధి నమూనాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు శ్రీ సీతారామస్వామి వారి ఆలయ అభివృద్ధి పథకంలో భాగంగా ఆర్కిటెక్ట్ ఆనంద సాయి సారథ్యంలో ఈ మూడు నమూనాలను తయారు చేయించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి ఆశీస్సులతో ఈ మూడు నమూనాలు కుదిరాయని, వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి, కేసీఆర్ సమక్షంలో తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వచ్చే శ్రీరామనవమి నాటికి ఆలయ అభివృద్ధికి తుదిరూపు కల్పిస్తామని చెప్పారు. 

More Telugu News