varun tej: 'తొలిప్రేమ'లో ఆ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయట!

  • వరుణ్ తేజ్ హీరోగా మరో ప్రేమ కథాంశం 
  • లండన్ లో కీలక సన్నివేశాలు 
  • అద్భుతమైన కెమెరా పనితనం 
  • ఈ నెల 10వ తేదీన భారీ రిలీజ్ 

'ఫిదా' సక్సెస్ తరువాత వరుణ్ తేజ్ మళ్లీ ప్రేమకథనే ఎంచుకున్నాడు. ఆ సినిమాలో మాదిరిగానే ఈ ప్రేమకథ ఇండియాలోనూ .. ఫారిన్ లోను కొనసాగుతుంది. కథాపరంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను లండన్ లో చిత్రీకరించారు. లండన్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు.

 ఆ సన్నివేశాలను సినిమాటోగ్రఫర్ జార్జ్ అద్భుతంగా చిత్రీకరించాడని చెబుతున్నారు. యూత్ హృదయాలను దోచుకునేలా ఆయన లండన్ అందాలను తన కెమెరాలో బంధించాడని అంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 10న విడుదల కానున్న ఈ సినిమాకి, తమన్ సంగీతం .. రాశి ఖన్నా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయనేది యూనిట్ సభ్యుల మాట.   

More Telugu News