Andhra Pradesh: ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!

  • రెండు కేటగిరీల ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచిన ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
  • ఫుల్ ఖుషీలో ఉద్యోగులు

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న రెండు కేటగిరీ ఉద్యోగుల వేతనాలను ఏకంగా 50 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో ఆగస్టు, 2016లో ప్రభుత్వం వేతనాలు పెంచుతూ జీవో జారీ చేసింది. అయితే పెంపు వల్ల కొందరికే ప్రయోజనం దక్కింది. రెండు కేటగిరీల ఉద్యోగులకు అప్పట్లో వేతనాలు పెరగలేదు.

దీనిని పరిగణనలోకి తీసుకున్న మంత్రి వర్గ ఉపసంఘం వారికి కూడా వేతనాలు పెంచాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలపడంతో ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News