helicopter crash: ఫ్రాన్స్ లో ఢీ కొన్న సైనిక హెలికాఫ్టర్లు.. ఐదుగురు మృతి చెందినట్లు ప్రకటించిన అధికారులు

  • మరొకరి జాడ ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌లేద‌ని తెలిపిన అధికారులు
  • సహాయక చర్యలు ప్రారంభం
  • ఆగ్నేయ ఫ్రాన్స్‌లో ఘటన

రెండు సైనిక హెలికాఫ్టర్లు ఢీకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌ ఆగ్నేయ ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మరొకరి జాడ ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌లేద‌ని అక్క‌డి అధికారులు చెప్పారు. స‌ద‌రు రెండు హెలికాఫ్టర్లు ఫ్రెంచ్‌ ఆర్మీ లైట్‌ ఏవియేషన్‌ స్కూల్‌కు చెందినవని వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న సహాయక బృందాలు ప్ర‌మాదం జ‌రిగిన సెయింట్‌ ట్రోపెజ్‌ పట్టణానికి ఉత్తరాన ఉన్న కార్కస్‌ సరస్సు ప్రాంతానికి చేరుకుని గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.

 

More Telugu News