metro: మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద స్టేషన్ అసిస్టెంట్‌ ఉద్యోగుల ఆందోళన

  • మెట్రోరైల్ అసిస్టెంట్‌ ఉద్యోగులు ఆందోళన
  • ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వారిని ఉద్యోగం నుంచి తీసేసిన వైనం
  • ఉద్యోగం కల్పిస్తామని ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయలు తీసుకున్నారని బాధితుల ఆరోపణలు

హైద‌రాబాద్‌లోని మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద స్టేషన్ అసిస్టెంట్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తమను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామంటూ అధికారులు చెప్పి పంపించేశారని వారు అంటున్నారు. ట్రిగ్ అనే సంస్థ తమను పనిలో నియమించుకుని మెట్రోస్టేషన్లలో అసిస్టెంట్లుగా ఉంచిందని చెప్పారు. అంతేకాదు, ఉద్యోగం కల్పిస్తామని ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయలు తీసుకున్నారని వారు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

More Telugu News