Kamal Haasan: ఈ సారి దృష్టి వారిపై మళ్లింది.. మంచిదే: బడ్జెట్‌పై కమల్ స్పందన

  • రైతులు, గ్రామీణ ప్రాంతాల గురించి పట్టించుకోవడం సంతోషించాల్సిన విష‌య‌ం
  • ఇది ఓ రకంగా వారికి ఓదార్పు లాంటిది
  • మధ్యతరగతి విషయంలో మాత్రం బడ్జెట్‌ విభిన్నంగా ఉంది

నిన్న ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర‌ బడ్జెట్‌పై సినీ న‌టుడు కమలహాసన్‌ స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి ఉన్నట్టుండి రైతులు, గ్రామీణ ప్రాంతాల వైపు మళ్లిందని, ఈ ప‌రిణామం సంతోషించాల్సిన విష‌య‌మ‌ని పేర్కొన్నారు. కేంద్ర‌ బడ్జెట్ దృష్టి గ్రామీణ ప్రాంతాల‌ వైపు మళ్లింద‌ని, ఇది ఓ రకంగా వారికి ఓదార్పు లాంటిదని చెప్పారు. కాక‌పోతే మధ్యతరగతి విషయంలో మాత్రం బడ్జెట్‌ విభిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని నెల‌ల నుంచి క‌మల హాస‌న్ కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తోన్న విషయం తెలిసిందే. 

More Telugu News