రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిశోర్‌లను ఆశ్చర్యంలో ముంచెత్తిన అమితాబ్‌ బచ్చన్‌.. హర్షం వ్యక్తం చేసిన నటులు

02-02-2018 Fri 16:50
  • ట్విట్టర్‌లో ఈ ఇద్దరు నటులను ఫాలో అవుతోన్న అమితాబ్ బచ్చన్
  • అమితానందంలో రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిశోర్‌
  • గర్వంగా ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్లు
సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్, హాస్య నటుడు వెన్నెల కిశోర్‌లను బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్ ఆశ్చర్యానికి గురిచేశారు. ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలలో అమితాబ్ బచ్చన్ ఒకరు. అందరూ ఆయనను ఫాలో అవుతోంటే ఆయన సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్, హాస్య నటుడు వెన్నెల కిశోర్‌లను ఫాలో అవుతున్నారు. తాజాగా సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్, హాస్య నటుడు వెన్నెల కిశోర్‌లకు ఓ నోటిఫికేషన్ వచ్చింది.

ట్విటర్ లో అమితాబ్ బచ్చన్ తమను ఫాలో అవుతున్నారని తెలుసుకున్న ఈ ఇద్దరు నటులు తమ తమ ఖాతాల్లో హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదని రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిశోర్ గర్వంగా ట్విట్టర్ ఖాతాల్లో దీని గురించి చెప్పారు. అంతేకాదు, అమితాబ్ బచ్చన్ మరికొందరు టాలీవుడ్ నటులను కూడా ఫాలో అవుతున్నట్లు సమాచారం.