vijay devarakonda: టీఆర్పీ రేటింగ్ పరంగాను 'అర్జున్ రెడ్డి' అదరగొట్టేశాడు

  • సంచలన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి'
  • ఇటీవలే స్టార్ మా టీవీలో ప్రసారం
  • ఆశ్చర్యపరిచే స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్         

ఈ మధ్య కాలంలో సంచలన విజయాన్ని సాధించిన చిత్రాల జాబితాలో 'అర్జున్ రెడ్డి' ఒకటి. కుర్రకారు హృదయాలను ఈ సినిమా ఒక రేంజ్ లో కొల్లగొట్టేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. దర్శకుడితో పాటు హీరో హీరోయిన్లకు ఈ సినిమా విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చేసింది.

అలాంటి ఈ సినిమాను ఇటీవల 'స్టార్ మా' ఛానల్లో ప్రసారం చేశారు. రిలీజ్ సమయంలో ఇది బూతు సినిమా అనే ముద్ర పడినప్పటికీ, టీవీలో ప్రసారం చేయబడిన ఈ సినిమాకి 13.6 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. అయితే థియేటర్ ప్రింట్ తో పోలిస్తే .. టీవీలో ప్రసారం చేసిన ఈ సినిమాలో నుంచి, బూతు డైలాగులు .. ముద్దు సీన్లు .. శృంగార సన్నివేశాలను తొలగించారు. ఆకట్టుకునే లవ్ స్టోరీ కారణంగానే ఈ సినిమాకి ఈ స్థాయి టీఆర్పీ రేటింగ్ వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      

More Telugu News