Nokia8: నోకియా8 స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు !

  • రూ.8,000 వరకు తగ్గింపు
  • రూ.28,999 ధరకే కొనవచ్చు
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో బీటా అప్‌డేట్‌ విడుదల

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నోకియా8 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సంస్థ నోకియా8 ఫోన్ పై రూ.8,000 వరకు ధరను తగ్గించింది. ఈ ఫోన్ ధర ఇంతకుముందు రూ.36,999గా ఉండేది. దీంతో ఇప్పుడు ఈ ‌ఫోన్‌ను వినియోగదారులు రూ.28,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

అలాగే నోకియా 5కు చెందిన 3జీబీ ర్యామ్ రియెంట్ ధరను కూడా రూ.1000కి తగ్గించారు. దీంతో ఈ ఫోన్‌ను యూజర్లు రూ.12,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం నోకియా8 ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ పై నడుస్తుంది. అయితే ఇటీవలే ఆండ్రాయిడ్ 8.1 ఓరియో బీటా అప్‌డేట్‌ను విడుదల చేశారు.

నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్:

  • 5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే
  • 4 జీబీ ర్యామ్
  • 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
  • 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
  • 13మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
  • 3,090 ఎమ్ఏహెచ్ బ్యాటరీ       

More Telugu News