USA: హాంకాంగ్ లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు... 4 వేల మందిని కాపాడామన్న అధికారులు!

  • రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ అధీనంలో హాంకాంగ్
  • అప్పట్లో బాంబులు కురిపించిన అమెరికా
  • పేలకుండా ఉండిపోయిన 1000 పౌండ్ల బాంబు
  • నిర్వీర్యం చేసిన హాంకాంగ్ పోలీసులు

అది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా తయారు చేసిన ఏఎన్-ఎం 65 బాంబు. దాదాపు 1000 పౌండ్ల బరువుంది. హాంకాంగ్ పై ఈ బాంబును వేయగా, అది పేలకుండా ఉండిపోయింది. దానిపై మట్టి పేరుకుపోయింది. చుట్టూ నివాస ప్రాంతాలు వెలిశాయి. మారిన కాలానికి అనుగుణంగా ఆ వీధిలో వాణిజ్య సముదాయాలు వెలిశాయి. నిత్యమూ బిజీగా మారిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో నూతన నిర్మాణం చేపట్టాలని భావించి తవ్వకాలు సాగిస్తుండగా, ఆ భారీ బాంబు బయటపడింది.

దీంతో యాంటీ బాంబ్ స్క్వాడ్, పోలీసులు జాగ్రత్తగా దాన్ని వెలికితీసి నిర్వీర్యం చేశారు. గడచిన వారం రోజుల వ్యవధిలో హాంకాంగ్ లో బయటపడిన రెండో బాంబు ఇది. ఇక ఇది పేలివుంటే ఈ ప్రాంతంలో దాదాపు 4 వేల మంది వరకూ మరణించి వుండేవారని అధికారులు తెలిపారు. ఈ బాంబు లభ్యమైన ప్రాంతం సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జపాన్ అధీనంలో ఉన్నదని, ఆ సమయంలోనే అమెరికా ఈ బాంబును జారవిడిచి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన తరువాత, బాంబును నిర్వీర్యం చేశామని వెల్లడించారు.

More Telugu News