Narendra Modi: బడ్జెట్ పై నిరాశ వ్యక్తం చేసిన యోగా గురువు బాబా రామ్ దేవ్!

  • సామాన్యులకు ఆదాయపు పన్ను మినహాయింపు లేదు
  • ఆదాయపు పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంచితే బాగుండేది
  • సామాన్య ప్రజలు నిరాశ చెందారు
  • ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి: బాబా రామ్ దేవ్

ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ నిరాశ వ్యక్తం చేశారు. సామాన్యులకు ఆదాయపు పన్ను మినహాయింపు లేదని, దానిపై పరిమితి రూ.5 లక్షలకు పెంచితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని, తద్వారా సగటు పన్ను చెల్లింపుదారులకు ఊరట లభిస్తుందని చాలా మంది ప్రజలు భావించారని, అలా జరగకపోవడంతో నిరాశ చెందారని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించి, త్వరలోనే ఓ నిర్ణయం ప్రకటిస్తుందని భావిస్తున్నానని అన్నారు. ఓ వైపు నిరాశ వ్యక్తం చేసిన బాబా రామ్ దేవ్, మరోవైపు ఈ బడ్జెట్ జాతి నిర్మాణ బడ్జెట్  అని వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News