sensex: జైట్లీ దెబ్బకు బేర్ మన్న మార్కెట్లు

  • ఒకానొక సమయంలో 463 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • చివరకు 58 పాయింట్ల నష్టంతో ముగింపు
  • దీర్ఘకాలిక పెట్టుబడుల లాభాలపై పన్ను విధిస్తామనడంతో నష్టాల్లోకి మార్కెట్లు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. బడ్జెట్ ప్రారంభ సమయంలో 100 పాయింట్లకు పైగా లాభంలో ఉన్న సెన్సెక్స్ బడ్జెట్ మొదలైన కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల లాభాలపై రూ. లక్షకు మించి ఆదాయం వచ్చిన పక్షంలో 10 శాతం పన్ను విధిస్తామంటూ జైట్లీ ప్రకటించడంతో... మార్కెట్ల పతనం ప్రారంభమయింది. ఒకానొక దశలో సెన్సెక్స్ ఏకంగా 463 పాయింట్లు పతనమైంది. ఈ తర్వాత క్రమంగా కోలుకుని చివరకు 58 పాయింట్ల నష్టంతో 35,907 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 11 పాయింట్లు నష్టపోయి 11,017 వద్ద స్థిరపడింది.

ఇవాల్టి టాప్ గెయినర్స్:
ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (11.09%), ఏజీస్ లాజిస్టిక్స్ (10.57%), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (8.07%), అవంతి ఫీడ్స్ (7.95%), జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ (7.25%).

టాప్ లూజర్స్:
వక్రాంగీ లిమిటెడ్ (-19.99%), జైన్ ఇరిగేషన్ (-9.43%), హిందుస్థాన్ కాపర్ (-5.70%), ఫోర్టిస్ హెల్త్ కేర్ (-4.96%), రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ (-4.95%).           

More Telugu News