raviteja: ఈ నెల లోనే 'అమర్ అక్బర్ అంథోని' షూటింగ్ మొదలు

  • శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ అంథోని'
  • ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ 
  • సంగీత దర్శకుడిగా తమన్

'టచ్ చేసి చూడు' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోన్న రవితేజ, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టికెట్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సినిమాతో పాటు రవితేజ .. శ్రీను వైట్లతో 'అమర్ అక్బర్ అంథోని' చేయనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది.

 ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ట్విట్టర్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానంగా రవితేజ స్వయంగా ఈ విషయం చెప్పాడు. ఈ సినిమాలో కథానాయికలుగా కాజల్ .. నివేదా థామస్ పేర్లు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుందని శ్రీను వైట్ల చెబుతున్నాడు.      

More Telugu News