pan: రూ. 2.50 లక్షలు దాటే ప్రతి లావాదేవీకి పాన్ నెంబర్ తప్పనిసరి!: జైట్లీ

  • నాన్-ఇండివిడ్యువల్స్ కు యూనిక్ ఎంటీటీ నంబర్
  • ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
  • పారదర్శకత కోసం ఎలక్ట్రానిక్ ఐటీ అసెస్ మెంట్

పన్ను ఎగువేతలను అరికట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజలకు ఆధార్ నంబర్ ఉన్నట్టే నాన్-ఇండివిడ్యువల్స్ కు యూనిక్ ఎంటిటీ నంబర్ (యూఈఎన్)ను తప్పనిసరి చేస్తోంది. పాన్ నంబర్ ను యూఈఎన్ గా పరిగణించనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇకపై రూ. 2.50 లక్షల నుంచి మొదలయ్యే ప్రతి లావాదేవీకి పాన్ నంబర్ ను తప్పినిసరి చేస్తోంది.

దీర్ఘకాల పెట్టుబడులకు సంబంధించి రూ. 1 లక్షకు మించి వచ్చే ఆదాయంపై 10 శాతం పన్ను విధించాలని జైట్లీ ప్రతిపాదించారు. పన్ను విధానంలో పారదర్శకతను తీసుకురావడానికి ఎలక్ట్రానిక్ ఐటీ అసెస్ మెంట్ ను తీసుకొస్తామని చెప్పారు. రూ. 250 కోట్ల వరకు టర్నోవర్ ఉండే కంపెనీలపై 25 శాతం పన్ను విధించనున్నారు. వివిధ రంగాల్లోని కొత్త ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్ లో కేంద్ర ప్రభుత్వం 12 శాతాన్ని భరించనుంది. 

More Telugu News