మణిరత్నం సినిమాలో మరోసారి ఛాన్స్ కొట్టేసింది

01-02-2018 Thu 14:15
  • మణిరత్నం దర్శకత్వంలో మల్టీ స్టారర్ 
  • గతంలో 'చెలియా' చేసిన అదితీరావు
  • మళ్లీ అవకాశం ఇచ్చిన మణిరత్నం    
మణిరత్నం ఎంపిక చేసుకున్న కథా వస్తువు ఆదరణ పొందకపోయినా, ఆయన మార్క్ చిత్రీకరణకు అభినందనలు దక్కుతూనే ఉంటాయి. అందుకే మణిరత్నం సినిమాలు వరుసగా పరాజయాల పాలైనా, ఆయన సినిమాలు చూడాలనే ఆసక్తి ఆడియన్స్ లో తగ్గదు. మణిరత్నం సినిమాలో ఒకసారి ఛాన్స్ రావడమే అదృష్టంగా నటీనటులు భావిస్తుంటారు. అలాంటి మణిరత్నం సినిమాలో రెండవసారి అవకాశం రావడమంటే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

అలాంటి అదృష్టాన్ని అదితీరావు మరోమారు సొంతం చేసుకుంది. గతంలో 'చెలియా' చిత్రాన్ని చేసిన ఆమెను, మణిరత్నం తన తాజా మల్టీ స్టారర్ లో కూడా తీసుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ .. మద్రాస్ టాకీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో, శింబు .. విజయ్ సేతుపతి .. అరవింద్ స్వామి .. ఫహద్ ఫాజిల్ .. ప్రకాశ్ రాజ్ .. జ్యోతిక .. ఐశ్వర్య రాజేశ్ .. జయసుధ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.