padmavaat: బాక్సాఫీస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న 'ప‌ద్మావ‌త్‌'

  • ఆరు రోజుల్లో రూ.200 కోట్ల మార్కును దాటిన 'ప‌ద్మావ‌త్‌'
  • ఓవ‌ర్సీస్‌లో రూ.76 కోట్ల వసూలు
  • వెల్లడించిన త‌ర‌ణ్ ఆద‌ర్శ్

జనవరి 25న రిలీజైన 'పద్మావత్' చిత్రం కలెక్షన్ల పరంగా మంచి ఫలితాలను రాబడుతోంది. కేవ‌లం ఆరు రోజుల్లోనే పద్మావత్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల మార్కును దాటింది. గురువారం-19 కోట్లు, శుక్ర‌వారం-32 కోట్లు, శ‌నివారం-27 కోట్లు, ఆదివారం-31 కోట్లు, సోమవారం-15 కోట్లు, మంగ‌ళ‌వారం-14 కోట్లు వ‌సూలు చేసింది. అలాగే ఓవ‌ర్సీస్‌లో రూ.76 కోట్లు (12 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలైంది. ఆ మేర‌కు ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ బాక్సాఫీస్ వివ‌రాల్ని అందించారు.

More Telugu News