railway budget: కేంద్ర బడ్జెట్ లో రైల్వేకు సంబంధించిన ముఖ్యాంశాలు

  • మూలధన వ్యయం రూ. 1.48 లక్షల కోట్లు
  •  ప్రయాణికుల భద్రతకు పెద్దపీట
  • 4200 రైల్వే క్రాసింగ్ ల తొలగింపు

2018-19 బడ్జెట్ లో రైల్వే భద్రతకు, ప్రయాణికుల భద్రతకు కేంద్ర ఆర్థిక మంత్రి పెద్ద పీట వేశారు. బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సమయంలో ఆయన ప్రసంగిస్తూ, రైల్వే విద్యుద్దీకరణకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. అన్ని రైళ్లలోను వైఫై, సీసీ టీవీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైల్వేకు సంబంధించిన ప్రధానాంశాలు ఇవే.

  • రైల్వే మూలధన వ్యయం రూ. 1.48 లక్షల కోట్లు.
  • 4200 మానవరహిత రైల్వే లెవెల్ క్రాసింగ్ ల తొలగింపు. 
  • ముంబై లోకల్ రైళ్ల కోసం 90 కి.మీ. మేర డబుల్ లైన్. 
  • ముంబై సబర్బన్ రైల్వేకు రూ. 17 వేల కోట్లు. 
  • బెంగళూరు మెట్రోకు రూ. 17 వేల కోట్లు.
  • రైల్వే భద్రతలో భాగంగా ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు పెద్దపీట. 
  • 18 వేల కిలోమీటర్ల మేర రైల్వే డబ్లింగ్.
  • దేశ వ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లకు ఆధునిక సౌకర్యాలు.
  • వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం. 

More Telugu News