nikhil: నిఖిల్ కి జోడీగా కేథరిన్ కి ఛాన్స్

  • 'కణితన్' రీమేక్ లో నిఖిల్ 
  • తెలుగులోను తమిళ దర్శకుడికే ఛాన్స్ 
  • ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం

తెలుగు తెరపై దూకుడు చూపించే యువ కథానాయకులలో నిఖిల్ ముందు వరుసలో కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా 'కిరాక్ పార్టీ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆయన తదుపరి సినిమాకి సన్నాహాలు జరిగిపోతున్నాయి. తమిళంలో హిట్ కొట్టిన 'కణితన్' రీమేక్ లో ఆయన చేయనున్నాడు.

తమిళంలో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సంతోష్ .. తెలుగులోనూ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇక 'కణితన్' లో నటించిన కేథరిన్ కి అదే పాత్ర తెలుగులోను లభించింది. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమా, జనవరిలోనే సెట్స్ పైకి వెళ్లవలసి వుంది గానీ, కొన్ని కారణాల వలన ప్రారంభం కాలేదు. ఈ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావొచ్చని అంటున్నారు. తెలుగులోను ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తుందేమో చూడాలి మరి.    

More Telugu News