Ramcharan: గోదావరి యాసలో ఉపాసనతో రామ్‌చరణ్ తేజ్ కామెడీ.. వీడియో వైరల్!

  • 'ఉప్సీ గారండీ చిట్టిబాబుకి ఆక‌లేస్తోందండీ' అంటూ చెర్రీ
  • రంగ‌స్థ‌లం షూటింగ్‌లో లంచ్ టైమ్‌లో వీడియో తీసిన ఉపాసన
  • అలరిస్తోన్న వీడియో

'ఉప్సీ గారండీ చిట్టిబాబుకి ఆక‌లేస్తోందండీ' అంటూ ఓ బొమ్మ‌ను చేతిలో ప‌ట్టుకుని గోదావ‌రి యాస‌లో సినీన‌టుడు రామ్ చ‌ర‌ణ్ తేజ్ అల‌రించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెర్రీ భార్య ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. రంగ‌స్థ‌లం షూటింగ్‌లో లంచ్ టైమ్‌లో ఈ వీడియో తీసినట్లు తెలిపింది. ఈ వీడియో మెగా అభిమానులను అలరిస్తోంది. కాగా, సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ 'రంగస్థలం 1985' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ కి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాలో చెర్రీ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తోంది.   

More Telugu News