Helicopter: ఇంటిపై పడ్డ హెలికాప్టర్‌.. ముగ్గురి మృతి!

  • ఇంట్లోని వారు క్షేమం
  • హెలికాప్టర్ లోని ప్రయాణికులు మృతి
  • భయాందోళనలకు గురైన స్థానికులు
  • అమెరికాలోని ద‌క్షిణ కాలిఫోర్నియాలో ఘటన

అమెరికాలోని ద‌క్షిణ కాలిఫోర్నియా న్యూపోర్ట్ బీచ్‌ ప్రాంతంలో ఘోర హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం చోటు చేసుకుంది. జాన్ వేన్ ఎయిర్ పోర్టు నుంచి న‌లుగురు ప్ర‌యాణికుల‌తో బ‌య‌లుదేరిన ఓ హెలికాఫ్ట‌ర్.. కేవ‌లం ఒకటిన్న‌ర కిలోమీట‌ర్లు ప్ర‌యాణించిన‌ త‌రువాత ఒక్క‌సారిగా ఓ ఇంటిపై ప‌డింది. దీంతో హెలికాప్ట‌ర్‌లోని న‌లుగురిలో ముగ్గురు మృతి చెందిన‌ట్లు, మరొకరికి గాయాలు అయినట్లు అక్క‌డి అధికారులు చెప్పారు. ఇంటి గోడకు మాత్రమే హెలికాప్టర్ ఢీ కొట్టడంతో ఈ ఘటనలో ఇంట్లోని వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ ఘటనతో పెద్ద శబ్దం వచ్చిందని, భయాందోళనలకు గురయ్యామని స్థానికులు చెప్పారు.  

More Telugu News