nagashourya: చరణ్ సినిమా పాటలో నుంచే 'ఛలో' టైటిల్ వచ్చింది: నాగశౌర్య

  • నా పాత్రను వెంకీ కుడుముల బాగా మలిచాడు
  • టైటిల్ నేను అనుకున్నదే 
  • ఆ ఆలోచన అలా వచ్చింది 
  • అంతా బాగుందన్నారు  

యూత్ లో నాగశౌర్యకి మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఛలో' వచ్చేనెల 2వ తేదీన థియేటర్స్ కి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగశౌర్య బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఖరారు చేయడానికి దారితీసిన సందర్భం గురించి ప్రస్తావించాడు.

" దర్శకుడు వెంకీ కుడుముల .. నిజ జీవితంలో నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఈ సినిమాలో నా పాత్రను మలిచాడు. ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టాలా అనే విషయంలో బాగా ఆలోచించాను. ఓ రోజున కారులో వెళుతూ చరణ్ 'బ్రూస్ లీ' సినిమాలోని 'లే ఛలో' పాట వింటున్నాను. నా సినిమాకి 'ఛలో' అనే టైటిల్ పెట్టాలనే ఆలోచన అప్పుడే వచ్చింది. అలా చరణ్ సినిమాలోని పాటలో నుంచే 'ఛలో' టైటిల్ వచ్చింది. ఈ టైటిల్ గురించి చెప్పగానే వెంకీ కుడుముల .. అమ్మానాన్నలు బాగుందన్నారు" అంటూ చెప్పుకొచ్చాడు.   

More Telugu News