god S*x and truth: 'జీఎస్టీ' వల్ల వర్మకు వచ్చిన లాభం ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!

  • 'జీఎస్టీ'కి అయిన ఖర్చు రూ. 70 లక్షలు
  • ఇందులో మియా మాల్కోవాకు ఇచ్చిందే ఎక్కువ
  • రూ. 11 కోట్ల వసూళ్లు

ఎన్నో నిరసనల మధ్య రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లఘు చిత్రం 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 19 నిమిషాల నిడివి గల ఈ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీంతో, నెట్లో ఇది విడుదల కాగానే, చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. లక్షల మంది ఒక్కసారిగా సైట్లోకి ఎంటర్ కావడంతో... అది క్రాష్ అయింది కూడా.

ఈ చిత్ర నిర్మాణానికి దాదాపు రూ. 70 లక్షలు ఖర్చైందట. ఇందులో ఎక్కువ భాగం మియా మాల్కోవాకే పోయిందట. ఇంకొంచెం మ్యూజిక్ అందించిన కీరవాణికి ఇచ్చారు. మరోవైపు, ఇప్పటి వరకు ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే కళ్లు తేలేస్తారు. ఏకంగా రూ. 11 కోట్లను ఇది కొల్లగొట్టింది. 

More Telugu News