justice sn shukla: జస్టిస్ శుక్లాపై వేటు వేయండి: రాష్ట్రపతికి లేఖ రాసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

  • మెడికల్ స్కాంలో జస్టిస్ శుక్లా పాత్ర
  • విచారణ జరిపిన ముగ్గురు జడ్జిల ప్యానెల్
  • శుక్లాను తొలగించాలంటూ సూచన

మెడికల్ అడ్మిషన్ల స్కాంకు తెరతీసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి ఎస్ఎన్ శుక్లాపై వేటు వేయాలని కోరుతూ రాష్ట్రపతి కోవింద్ కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా లేఖ రాశారు. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి భారీ స్కాం చోటు చేసుకుంది. కొన్ని మెడికల్ కాలేజీలపై బ్యాన్ ఉన్న సమయంలో కూడా విద్యార్థులను చేర్చుకోవడానికి శుక్లా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో, జస్టిస్ ఎస్ఎన్ శుక్లా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి.

దీంతో, ముగ్గురు జడ్జిలతో కూడా ఓ కమిటీ శుక్లాపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా శుక్లా ముడుపులు తీసుకున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో, శుక్లాను తొలగించాలంటూ జడ్జిల ప్యానెల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రికమెండ్ చేసింది. దీంతో, శుక్లాపై వేటు వేయాలంటూ రాష్ట్రపతికి సీజేఐ లేఖ రాశారు. హైకోర్టు జడ్జిలను తొలగించాలంటే పార్లమెంటులో ఇంపీచ్ మెంట్ ప్రక్రియ నిర్వహించాల్సి వుంటుంది. 

More Telugu News