ram gopal varma: ఇక జీఎస్టీ-2.. మరో కలకలం రేపుతోన్న రామ్ గోపాల్ వర్మ

  • ఇటీవలే జీఎస్టీ సినిమా విడుదల చేసిన వర్మ
  • ‘జీఎస్టీ’కి అద్భుతమైన స్పందన వస్తోంది
  • జీఎస్టీ- 2ని వెంటనే ప్రారంభిస్తా
  • ఆ భగవంతుడు, జీఎస్టీ లవర్స్ మద్దతు తెలుపుతారు

ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా ఎవరి మాటా విన‌కుండా త‌న‌దైన శైలిలో సినిమాలు తీస్తూ దూసుకుపోతోన్న వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇటీవ‌లే గాడ్, సెక్స్, ట్రూత్ పేరుతో శృంగార‌మే ప్ర‌ధానాశంగా ఓ సినిమా తీసిన విష‌యం తెలిసిందే. మ‌హిళా సంఘాల ఘాటు హెచ్చ‌రిక‌ల‌ను కూడా ప‌ట్టించుకోకుండా ఈ సినిమాను ఆన్ లైన్లో విడుద‌ల చేసిన వ‌ర్మ‌.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా జీఎస్టీ-2 తీస్తానని ప్రకటించి మరో కలకలం రేపారు.

పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించిన ‘జీఎస్టీ’కి వస్తున్న అద్భుతమైన స్పందన చూశాక జీఎస్టీ- 2ని వెంటనే ప్రారంభించాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఆ భగవంతుడు, తన జీఎస్టీ లవర్స్ తనకు మద్దతు తెలుపుతారని తాను నమ్ముతున్నానని ట్వీట్ చేశారు. 

More Telugu News