Chandrababu: చంద్రబాబు, కేసీఆర్ లపై చంద్రగ్రహణం తీవ్ర ప్రభావం చూపుతుందట!

  • రేపు చంద్ర గ్రహణం
  • మేషం, కర్కాటకం, ధనుస్సు, సింహ రాశులపై తీవ్ర ప్రభావం
  • ముఖ్యమంత్రులు ఇద్దరూ కర్కాటక రాశికి చెందినవారు

రేపు చంద్రగ్రహణం. ఇది సాధారణ చంద్రగ్రహణం కాదు. 'సూపర్ బ్లూ బ్లడ్ మూన్' వినువీధిలో కనువిందు చేయబోతోంది. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఇది వస్తోంది. దీని కోసం ప్రపంచమంతా కళ్లింతలు చేసుకుని ఎదురు చూస్తోంది. సూపర్ మూన్ అంటే సాధారణంగా కనిపించే దానికన్నా చంద్రుడు ఇంకా పెద్దదిగా కనిపిస్తాడు. భూ కక్ష్యకు దగ్గరగా వచ్చిన సమయంలో మనం దాన్ని చూడగలం.

 కొంచెం నీలం రంగులో ఉండే బ్లూ మూన్ రెండు మూడేళ్లకు ఓసారి దర్శనం ఇస్తుంది. అయితే, పరిమాణంలో పెద్దగా ఉండి, నీలం, ఎరుపు రంగు కలసినట్టు ఉండేదే 'సూపర్ బ్లడ్ మూన్'. దీన్ని ఖగోళ అద్భుతంగా శాస్త్రవేత్తలు చెబుతారు. 1866లో సూపర్ బ్లడ్ మూన్ వచ్చింది. రేపు కనిపించిన తర్వాత మళ్లీ 150 ఏళ్లకు మాత్రమే కనిపిస్తుంది. రేపు చంద్రగ్రహణం కూడా ఉండటంతో, మనం ఈ సూపర్ మూన్ ను ఎక్కువసేపు చూడలేం.

మరోవైపు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారిపై ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, ధనుస్సు, సింహరాశి వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ కర్కాటక రాశికి చెందినవారే, దీంతో, గ్రహణ ప్రభావం వీరిద్దరిపై తీవ్రంగానే ఉంటుందని జ్యోతిష్య పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో, ఇరు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ గ్రహణం ఇరువురిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే విషయం ఆసక్తికరంగా మారింది. 

More Telugu News