raviteja: రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసిన నివేదా థామస్?

  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ 
  • ఆ తరువాత సినిమా శ్రీను వైట్లతో 
  • కథానాయికగా నివేదా థామస్ 
  • ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్

తెలుగు తెరపై క్రేజ్ పరంగా .. అవకాశాల పరంగా దూసుకుపోతోన్న కథానాయికలలో నివేదా థామస్ ఒకరు. తెలుగులో 'జెంటిల్ మేన్' .. 'నిన్నుకోరి' .. 'జై లవకుశ' సినిమాలతో వరుస విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. తాజాగా ఆమె రవితేజతో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ చేస్తోన్న 'నేల టికెట్' సినిమాలోనే నివేదా థామస్ ను తీసుకోవాలనుకున్నారు గానీ కుదరలేదు. అయినా శ్రీను వైట్లతో రవితేజ చేసే సినిమాలో ఆమె ఛాన్స్ దక్కించుకోగలిగిందని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'అమర్ అక్బర్ అంథోని' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. గతంలో రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు విజయాలను అందుకోవడం వలన, ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.       

More Telugu News