Cow: అమ్మ ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం కావాలా? తల్లడిల్లిన గోమాత వీడియో చూడండి!

  • లేగదూడకు గాయం
  • తల్లడిల్లిన తల్లి
  • ఆసుపత్రికి తీసుకు వెళుతుంటే ఆటో వెంట పరుగులు
  • వైరల్ అవుతున్న వీడియో

మనుషులైనా, జంతువులైనా కన్నబిడ్డ కన్నబిడ్డేనని, పేగు తెంచుకు పుట్టిన బిడ్డకు ఏదైనా జరిగితే, తల్లి తల్లడిల్లుతుందని చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదేమో. గాయపడిన ఓ లేగదూడను ఆటోలో ఆసుపత్రికి తీసుకు వెళుతున్న వేళ, తన బిడ్డకు ఏమైందోనన్న ఆరాటంతో, తల్లి గోవు ఆటో వెంట పరిగెడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కర్ణాటకలోని హవేరీ ప్రాంతంలో ఈ దృశ్యాలను రికార్డు చేశారు. రెండు నెలల లేగదూడకు గాయం కాగా, ఇన్ఫెక్షన్ సోకి నడవలేని స్థితికి లేగ చేరుకుంది. దీంతో దాని యజమాని దూడను ఆటోలో ఎక్కించుకుని బయలుదేరగా, తల్లిగోవు దాని వెంట పరుగులు పెట్టింది. దూడను ఈ నెల 25న ఆసుపత్రిలో చేర్పించగా, కోలుకోవడంతో 28న డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు వెల్లడించారు. తల్లిప్రేమకు అసలైన నిర్వచనం చెబుతున్న వీడియోను మీరూ చూడండి.

More Telugu News