america: ఆహ్వానపత్రికలో అక్షర దోషాలు.. వైట్ హౌస్ పై జోకులు!

  • గతంలో తప్పుడు స్పెల్లింగ్ తో ట్వీట్ చేసి నవ్వుల పాలైన ట్రంప్
  • తాజా తప్పుడు స్పెల్లింగ్ తో ఆహ్వానపత్రిక పంపిణీ చేసి నవ్వులపాలైన వైట్ హౌస్
  • సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌస్ నవ్వులపాలైంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అధ్యక్ష భవనం వైట్ హౌస్ దొందూ దొందేనంటూ ఎద్దేవా చేస్తున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే.. నేడు నిర్వహించనున్న 115వ కాంగ్రెస్‌ సమావేశాల్లో భాగంగా స్టేట్‌ యూనియన్‌ సభ్యులను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి వైట్‌ హౌస్ పలువురికి ఆహ్వానం పంపింది.

ఈ ఆహ్వానపత్రికలో ‘యూనియన్‌’ బదులు ‘యూనివోమ్‌’ అని పడింది. అంతే.. వైట్ హౌస్ ను నెటిజన్లు ఆడుకోవడం మొదలుపెట్టారు. అధ్యక్షుడు చేసే ట్వీట్లలోనే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నప్పుడు... అధికారుల ఆహ్వానపత్రంలో లేకుంటే ఎలా? అంటూ గేలి చేస్తున్నారు. కాగా, దీనిపై స్పందించిన వైట్ హౌస్ వివరణ ఇస్తూ, ముద్రణ తమ చేతుల్లో లేదని, జరిగిన తప్పును సరిదిద్ది కొత్త ఇన్విటేషన్స్ పంపామని చెబుతున్నారు.  

More Telugu News