Spice Jet: స్పైస్ జెట్ కు 20 కొత్త విమానాలు... 10 నవ్యాంధ్రకు!

  • 'కనెక్టెడ్ ది అన్ కనెక్టెడ్' స్కీమ్ లో భాగంగా కొత్త సేవలు
  • విశాఖ నుంచి కోల్ కతాకు డైరెక్ట్ ఫ్లయిట్
  • చెన్నై - విశాఖపట్నం మధ్య కూడా
  • దక్షిణాదికి 18 విమానాలు కేటాయించిన స్పైస్ జెట్

ప్రాంతీయ కనెక్టివిటీకి ప్రాధాన్యమిస్తూ 'కనెక్టెడ్ ది అన్ కనెక్టెడ్' పేరిట నవ్యాంధ్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ కొత్త విమాన సేవలను ప్రారంభించనున్నట్టు స్పైస్ జెట్ వెల్లడించింది. మొత్తం 20 విమానాలను ప్రవేశపెట్టామని, వీటిల్లో 10 ఏపీకి కేటాయించామని సంస్థ ప్రకటించింది. కోల్ కతా నుంచి జబల్ పూర్, బెంగళూరు నుంచి పుదుచ్చేరి మధ్య డైరెక్టు విమాన సర్వీసులు ప్రారంభించిన తొలి సంస్థ కూడా తమదేనని తెలిపింది. ఫిబ్రవరి 11 నుంచి అనేక రూట్లలో కొత్త సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపింది.

 ఇక ఏపీకి కేటాయించే విమానాలు చెన్నై - విశాఖపట్నం, కోల్ కతా - విశాఖపట్నం, చెన్నై - విజయవాడ మార్గాల్లో నాన్ స్టాప్ గా తిరుగుతాయి. వీటితో పాటు చెన్నై, విశాఖపట్నం, కోల్ కతా, విజయవాడ మధ్య రోజువారీ విమానాలను, బెంగళూరు - తిరుపతి మధ్య మంగళవారం మినహా సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లో 18 విమానాలతో మెట్రో, నాన్ మెట్రో నగరాల మధ్య సర్వీసులను నడిపిస్తామని స్పైస్ జెట్ పేర్కొంది.

More Telugu News