Amitabh Bachchan: 'సైరా' సెట్లోకి ఎంట్రీ ఇస్తున్న అమితాబ్ బచ్చన్!

  • 'సైరా' చిత్రంలో అమితాబ్ బచ్చన్
  • త్వరలోనే షూటింగ్ కు హాజరు
  • వెల్లడించిన చిత్ర యూనిట్ సభ్యులు

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా' సెట్స్ లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగ్ లో పాలుపంచుకోనున్నారు. ఈ విషయాన్ని 'సైరా' యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. మరోవైపు, ఈ సినిమాలో చిరంజీవి సరసన అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్ నటిస్తుందని తొలుత ఊహాగానాలు వెలువడినా... చివరకు నయనతారను ఎంపిక చేశారు. 

More Telugu News