Tirumala: తొలిసారి తిరుమలకు వెళుతున్నారా?... మీకు ప్రాధాన్యం!

  • సులభంగా, వేగంగా దర్శనం
  • జీవితాంతం గుర్తుండి పోయే అనుభవం అందిస్తాం
  • కొత్త విధానం అమలుకు యోచిస్తున్నాం
  • ఏపీ మంత్రి పైడికొండల

తొలిసారిగా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని, వారికి టీటీడీ అందించే సమస్త సౌకర్యాలనూ కల్పించి, సులభతరంగా, వేగంగా దర్శనం చేయించి, ఆ పర్యటన వారికి జీవితాంతమూ గుర్తుండి పోయేలా చూడాలన్న ఉద్దేశంతో కొత్త విధానాన్ని అమలులోకి తేవాలని యోచిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు.

ఇటీవల టీటీడీ అమలు చేసిన స్లాట్ విధానం విజయవంతమైందని, అన్ని దేవాలయాల్లో అదే విధానాన్ని పాటించాలని ఆలోచిస్తున్నట్టు చెప్పిన ఆయన, పదే పదే ఒకే భక్తుడు తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోకుండా చూడాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఒక్కో భక్తుడికి ఏడాదికి నాలుగు సార్లు మించి దర్శనానికి అనుమతించరాదని భావిస్తున్నామని, ఆధార్ అనుసంధానం అందుకు సహకరిస్తుందని వెల్లడించారు. మార్చి నుంచి పూర్తి స్థాయిలో ఆధార్ అనుసంధానిత స్లాట్ విధానం అమలులోకి తెస్తామని చెప్పిన ఆయన, సామర్థ్యానికి మించిన భక్తుల రాకను నియంత్రించే దిశగా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News