allari naresh: అల్లరి నరేశ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు!

  • భీమనేనితో ఓ మూవీ చేస్తున్న అల్లరి నరేశ్ 
  • తాజాగా గిరి అనే దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ 
  • త్వరలోనే సెట్స్ పైకి   

చాలా కాలం క్రితం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేశ్ చేసిన 'సుడిగాడు' భారీ విజయాన్ని సాధించింది. నిజం చెప్పాలంటే ఆ స్థాయి విజయం అల్లరి నరేశ్ కి మళ్లీ లభించలేదు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్టు చేయడానికి అల్లరి నరేశ్ రెడీ అవుతున్నట్టుగా సమాచారం.

గతంలో 'నందిని నర్సింగ్ హోమ్' చేసిన దర్శకుడు 'గిరి' .. ఇటీవల అల్లరి నరేశ్ కి ఒక కథ వినిపించాడట. ఆ కథ కొత్తగా అనిపించడంతో .. చేయడానికి వెంటనే అల్లరి నరేశ్ అంగీకరించాడని అంటున్నారు. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News