USA: ఎవర్ని కుట్టాలో దగ్గరుండి జూనియర్ దోమలకు నేర్పించే సీనియర్లు... నూతన అధ్యయనం వెల్లడించిన ఆసక్తికర అంశాలు!

  • కొందరినే టార్గెట్ చేసుకునే దోమలు
  • మళ్లీ మళ్లీ కుట్టడాన్ని వేగంగా నేర్చుకునే దోమలు
  • డోపమైన్ అనే రసాయనమే కారణం
  • యూఎస్ వర్శిటీ అధ్యయనంలో వెలుగులోకి

స్నేహితులు, బంధువులతో కలసి ఒక చోట చేరినప్పుడు వాళ్లల్లో ఒకరో, ఇద్దరో దోమలు తెగ కుడుతున్నాయంటూ గోల పెట్టడం ప్రతి ఒక్కరికీ అనుభవమే. కొందరిని కుట్టని దోమలు, మరికొందరిని తెగ కుట్టేస్తుంటాయి. ఇలా కొందరినే దోమలు టార్గెట్ చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయట. అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 'కరెంట్‌ బయాలజీ' అనే జర్నల్‌ ఈ అధ్యయనం వివరాలను ప్రచురించింది. దీని ప్రకారం, ఎవరిని కుట్టాలన్న విషయమై సీనియర్ ఆడదోమలు జూనియర్ దోమలకు ప్రత్యేక శిక్షణ ఇస్తాయట. ఒకసారి కుట్టిన వ్యక్తిని మరోసారి కుట్టి రక్తాన్ని పీల్చడం ఎలాగన్న విషయాన్ని దోమలు సూపర్ ఫాస్ట్ గా నేర్చేసుకుంటాయట. దీనికి వాటి మెదడులో ఉండే డోపమైన్ అనే రసాయనం కారణమని, న్యూరాన్ కణాల మధ్య సంకేతాలు పంపుతూ, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేందుకు ఇది ఉపకరిస్తుందని అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎవర్ని కుట్టాలో నేర్పే ప్రక్రియను ఏడిస్‌ ఈజిప్ట్‌ అనే ఆడదోమలు నేర్పిస్తాయని కూడా వీరు తెలియజేశారు.

More Telugu News