ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ విజేత ఫెదరర్

Sun, Jan 28, 2018, 05:33 PM
  • మెన్స్ సింగిల్స్  ఫైనల్ లో మారిన్ ఫెదరర్ విజయం
  • తన కెరీర్ లో 20వ గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకున్న ఫెదరర్
  • ఆరోసారి ఛాంపియన్ గా నిలిచిన స్విస్ క్రీడాకారుడు
ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ -2018 విజేతగా స్విస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్  ఫైనల్ లో మారిన్ సిలిక్ పై ఫెదరర్ విజయం సాధించాడు. 6-2, 6-7(5), 6-3, 3-6, 6-1 తేడాతో మారిన్ పై  ఫెదరర్ గెలిచాడు... దీంతో, ఫెదరర్ తన కెరీర్ లో 20వ గ్రాండ్ స్లామ్ సాధించినట్టయింది. ఆస్టేలియన్ ఓపెన్ లో 2004, 2006, 2007, 2010, 2017 లో ఫెదరర్ ఛాంపియన్ గా నిలిచాడు. తాజా విజయంతో మొత్తం 6 టైటిళ్లను ఫెదరర్ సొంతం చేసుకున్నాడు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad