oxford: ఆక్స్ ఫర్డ్ లో చేరిన ఆధార్... 2017 సంవత్సరానికి హిందీ పదంగా ఎంపిక!

  • ఆధార్ తో పోటీపడ్డ మరికొన్ని పదాలు
  • చర్చల అనంతరం ఆధార్ కే ఓటు
  • జైపూర్ సాహిత్య ప్రదర్శనలో వెలువడిన ప్రకటన

భారత ప్రజలకు సంబంధించిన ఆధార్ గుర్తింపు కార్డు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కావడంతో దీనికి ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ బృందం గౌరవించింది. 2017 సంవత్సరానికి హిందీ పదంగా ఆధార్ (Aadhaar) కు చోటు కల్పించాలని నిర్ణయించింది. జైపూర్ లో జరుగుతున్న సాహిత్య ప్రదర్శనలో ఈ ప్రకటన వెలువడింది. అలాగే, మిత్రన్, నోట్ బండి, గోరక్షక్ పదాలు సైతం ఆధార్ తో పోటీ పడ్డాయి. చర్చల అనంతరం 2017 సంవత్సరానికి హిందీ పదంగా ఆధార్ ను ఎంపిక చేశారు. రాజకీయ నాయకులు హిందీ పదమైన మిత్రన్ (స్నేహితులు)ను ఉపయోగిస్తుంటారని, గ్రామర్ పరంగా ఇది సరైన ఉచ్చారణ కాదని, మిత్రో అన్నది సరైన పదంగా రచయిత అశోక్ వాజ్ పేయి అన్నారు.

More Telugu News