kcr: సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి

  • కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటే..‘క.చ.రా’
  • రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్ తో రాష్ట్రాన్ని నడిపించడం సరే! 
  • అప్పులతో అల్లాడుతున్న రైతులను ఆదుకోరే?
  • కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ పై టీ- కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఎన్ డీఎస్ఎల్ కర్మాగారాల పునరుద్ధరణకు జరుగుతున్న రిలే దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్ తో రాష్ట్రాన్ని నడిపిస్తున్నామంటున్న కేసీఆర్ సర్కారు, అప్పులతో అల్లాడుతున్న రైతులను ఏ విధంగా ఆదుకుంటుందని ప్రశ్నించారు.

‘సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  అంటే..క.చ.రా’ అంటూ రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎంపీ కవితలను ఉత్తములుగా టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రచారం చేసుకుంటోందని, అటువంటి ప్రభుత్వానికి ఎన్ డీఎస్ ఎల్ కర్మాగారాలను నడిపించే శక్తి లేదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నీ రేవంత్ రెడ్డి వదిలిపెట్టలేదు. ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘గుడిబాట’ వీడి ‘పొలంబాట’ పడితే క్షేత్ర స్థాయిలో సర్కారు పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందని సెటైర్ వేశారు.

More Telugu News