IPL: ఐపీఎల్ వేలం రెండో రోజు... జాక్ పాట్ కొట్టిన కర్ణాటక ప్లేయర్ గౌతమ్!

  • రెండో రోజు మొదలైన ఆటగాళ్ల వేలం
  • రూ. 20 లక్షల కనీస ధర ఉన్న గౌతమ్ కు రూ. 6.20 కోట్ల ఆఫర్
  • దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
  • ఆర్సీబీ సొంతమైన మహ్మద్ సిరాజ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ఆటగాళ్ల వేలం రెండో రోజు మొదలైంది. తొలి రోజు వేలంలో గేల్, ఆమ్లా వంటి ఆటగాళ్లు అమ్ముడు పోలేదన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అసలు ఊరు, పేరు తెలీని క్రికెటర్లకు భారీ ధర పలికింది. అటువంటి ఘటనలే రెండో రోజూ చోటు చేసుకున్నాయి. కర్ణాటకకు చెందిన ఆఫ్ స్నిన్నర్ గౌతమ్ జాక్ పాట్ కొట్టాడు. అతన్ని రూ. 6.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. గౌతమ్ కనీస ధర రూ. 20 లక్షలు మాత్రమే. గౌతమ్ కోసం అన్ని ఫ్రాంచైజీలూ పోటీ పడ్డాయి.

ఇక స్నిన్నర్ రాహుల్ చాహర్ ను రూ. 1.90 కోట్లకు ముంబై ఇండియన్స్, మురుగన్ అశ్విన్ ను రూ. 2.20 కోట్లకు ఆర్సీబీ, వెస్టిండీస్ ఓపెనింగ్ ఆటగాడు ఇవెన్ లూయిస్ ను రూ. 3.80 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకున్నాయి. మొహ్మద్ సిరాజ్ ను రూ. 2.60 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆఫ్గనిస్థాన్ కు చెందిన స్పిన్ బౌలర్ ముజీబ్ జాద్రాన్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 4 కోట్లకు దక్కించుకుంది. ప్రగ్యాన్ ఓజా, నాథన్ లియాన్ తదితరులను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తిని చూపక పోవడం గమనార్హం.

More Telugu News