Virat Kohli: ఏడేళ్ల తర్వాత సఫారీ గడ్డపై భారత్ విజయం.. మరో రికార్డును సొంతం చేసుకున్న కోహ్లీ!

  • జొహన్నెస్‌బర్గ్‌లో భారత్ రికార్డు పదిలం
  • అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో కోహ్లీకి రెండో స్థానం
  • తమకంటే దక్షిణాఫ్రికా బాగా ఆడిందన్న కోహ్లీ

దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన చివరి టెస్టులో భారత్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌లో 2-1తో పరువు నిలబెట్టుకుంది. భారత్‌కు ఇది అపూర్వ విజయమే. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ జట్టు నెగ్గడం ఏడేళ్లలో ఇదే తొలిసారి. ఈ టెస్టు విజయంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ 21 టెస్టు విజయాలతో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌లలో రెండో స్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ కంటే ముందు సౌరవ్ గంగూలీ ఉన్నాడు. అంతేకాదు.. జొహన్నెస్‌బర్గ్‌లో భారత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం. భారత్ ఈ మైదానంలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడగా మూడు డ్రా అయ్యాయి. రెండింటిలో భారత్ విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం సారథి కోహ్లీ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా తమకంటే బాగా ఆడిందని కితాబిచ్చాడు. అయితే మూడో టెస్టులో మాత్రం వారికంటే తామే బాగా ఆడామని పేర్కొన్నాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌ను స్టేడియంలోని ప్రేక్షకులు, క్రికెట్ అభిమానులు ఆస్వాదించి ఉంటారని పేర్కొన్నాడు.

More Telugu News