Medaram: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సికింద్రాబాద్, ఖమ్మం, కాజీపేట నుంచి ప్రత్యేక రైళ్లు

  • జనవరి 31, ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో ‘మేడారం’ రైళ్లు
  • అనువైన వేళల్లో భక్తులకు అందుబాటులో ఉండేలా షెడ్యూలు
  • సద్వినియోగం చేసుకోవాలని కోరిన దక్షిణ మధ్య రైల్వే

తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతికెక్కిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో మధ్యాహ్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు తెలిపింది. మొత్తం జనరల్ బోగీలు ఉండే సికింద్రాబాద్-వరంగల్ స్పెషల్ (07014) రైళ్లు మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి 3:40 గంటలకు వరంగల్ చేరుకుంటాయి. తిరిగి వరంగల్ నుంచి అవే తేదీల్లో సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరి రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

కాజీపేట-సిర్పూరు కాగజ్‌నగర్ స్పెషల్ (07019) రైలు కాజీపేట నుంచి జనవరి 31న రాత్రి 7 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11 గంటలకు సిర్పూరు కాగజ్‌నగర్ చేరుకుంటుంది. కాగజ్‌నగర్‌-కాజీపేట స్పెషల్ (07020) సిర్పూరు కాగజ్‌నగర్ నుంచి ఫిబ్రవరి 4న ఉదయం 5:30 గంటలకు బయలుదేరి ఉదయం 9 గంటలకు కాజీపేట చేరుకుంటుంది.
 
సిర్పూరు కాగజ్‌నగర్-ఖమ్మం స్పెషల్ (07017) కాగజ్‌నగర్ నుంచి ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:15 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. ఖమ్మం-సిర్పూరు కాగజ్‌నగర్ స్పెషల్ (07018) ఖమ్మం నుంచి ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సాయంత్రం 4:45 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు సిర్పూరు కాగజ్‌నగర్ చేరుకుంటుంది. మేడారం భక్తులు ఈ విషయాన్ని గమనించాలని, ప్రత్యేక రైళ్ల సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

More Telugu News