Kamal Haasan: దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి!: ప్రజలకు కమలహాసన్‌ పిలుపు

  • దేశాన్ని ఎవ‌రు దోచుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి
  • ప్ర‌జ‌లంతా క‌లిస్తే సమాజంలో మార్పులు తీసుకురావ‌చ్చు
  • ఆ స‌మ‌యం ఆస‌న్న‌మైంది
  • ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టొద్దు

దేశంలో ఏం జ‌రుగుతుందో ప్ర‌జ‌లు ఎప్ప‌టికప్పుడు తెలుసుకుంటూ ఉండాల‌ని సినీన‌టుడు క‌మ‌లహాస‌న్ అన్నారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ఇటీవ‌లే క‌మ‌ల హాస‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా చెన్నైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌మ‌ల హాస‌న్ మాట్లాడుతూ యువత తనతో కలిసి పనిచేయడానికి రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

అలాగే, దేశాన్ని ఎవ‌రు దోచుకుంటున్నారో కూడా తెలుసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌ల‌పై ఉంద‌ని అన్నారు. ప్ర‌జ‌లంతా క‌లిస్తే సమాజంలో మార్పులు తీసుకురావ‌చ్చ‌ని, ఆ స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని వ్యాఖ్యానించారు. కాగా, ప్ర‌భుత్వం లిక్క‌ర్ వ్యాపారుల‌తో వ‌చ్చే ఆదాయంపై దృష్టి పెట్ట‌కుండా దేశంలో విద్య‌, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాల‌ని హిత‌వు ప‌లికారు.   

More Telugu News