pavan: పవన్ ను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందంతే: ప్రభాస్ శ్రీను

  • పవన్ తో కలిసి ఫస్టు టైమ్ చేశాను
  • అది హరీశ్ శంకర్ చలవ 
  • ఆ సీన్ బాగా పండింది

తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ, పవన్ తో తనకి గల అనుబంధం గురించి ప్రస్తావించాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా సమయంలోనే మొదటిసారిగా పవన్ ను దగ్గరగా చూశాను. ఈ సినిమాలో హరీశ్ శంకర్ చిన్నవేషం ఇచ్చారు. రెండు రోజుల పాటు షూటింగ్ ఉంటుందని అన్నారు. అయితే ఈ రెండు రోజులు కూడా నేను చేయలేని పరిస్థితి వచ్చింది".

"ఒక రోజు షూటింగుకు వెళ్లడం కుదరలేదు. రెండో రోజున చివరి నిమిషంలో పొల్లాచ్చి వెళ్లి హరీశ్ శంకర్ ను రిక్వెస్ట్ చేయడంతో ఒప్పేసుకున్నారు. ఆ రోజున పవన్ గారు సీనంతా ఎంజాయ్ చేస్తూ చేసిన తీరు చూశాక, ఆయన కాంబినేషన్లో ఫస్టు టైమ్ చేసిన ఆ సీన్ పండుతుందనే నమ్మకం కలిగింది. ఆయన ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు .. కానీ అందరినీ గమనిస్తూనే వుంటారు. ఆయనను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందంతే" అంటూ చెప్పుకొచ్చారు.      

More Telugu News