ipl auction: ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు వీరే.. బోర్లా పడ్డ యువీ, హర్భజన్!

  • వేలంపాటలో మారుతున్న తలరాతలు
  • అత్యధిక ధరకు బెన్ స్టోక్స్ 
  • రూ. 2 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయిన యువీ

ఐపీఎల్ సీజన్-11 వేలంపాటలో ఆటగాళ్ల తలరాతలు మారుతున్నాయి. కొందరు అత్యధిక పారితోషికానికి అమ్ముడుపోతుండగా... మరికొందరు చివరి సీజన్ కన్నా తక్కువ ధరకు అమ్ముడుపోతున్నారు. క్రిస్ గేల్ లాంటి విధ్వంసకర బ్యాట్స్ మెన్ ను ఎవరూ కొనుగోలు చేయకపోవడంలాంటి సన్నివేశాలు కూడా చోటు చేసుకున్నాయి. వేలంపాట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లలో అధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే (కోట్ల రూపాయల్లో).

బెన్ స్టోక్స్ - 12.50 - రాజస్థాన్ రాయల్స్
కేఎల్ రాహుల్ - 11.00 - కెంగ్స్ ఎలెవెన్ పంజాబ్
మనీష్ పాండే - 11.00 - సన్ రైజర్స్ హైదరాబాద్
క్రిస్ లిన్ - 9.60 - కోల్ కతా నైట్ రైడర్స్
మిచెల్ స్టార్క్ - 9.40 - కోల్ కతా నైట్ రైడర్స్
గ్లెన్ మ్యాక్స్ వెల్ - 9.00 - ఢిల్లీ డేర్ డెవిల్స్
సంజు శాంసన్ - 8.00 - రాజస్థాన్ రాయల్స్
కేదార్ జాధవ్ - 7.80 - చెన్నై సూపర్ కింగ్స్
రవిచంద్రన్ అశ్విన్ - 7.60 - కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
క్రిస్ వోక్స్ - 7.40 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

దినేష్ కార్తీక్ - 7.40 - కోల్ కతా నైట్ రైడర్స్
రాబిన్ ఉతప్ప - 6.40 - కోల్ కతా నైట్ రైడర్స్
డ్వేన్ బ్రావో - 6.40 - చెన్నై సూపర్ కింగ్స్
అరోన్ ఫించ్ - 6.20 - కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
కరుణ్ నాయర్ - 5.60 - కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
శిఖర్ ధావన్ - 5.20 - సన్ రైజర్స్ హైదరాబాద్            
వృద్ధిమాన్ సాహా - 5.00 - సన్ రైజర్స్ హైదరాబాద్
ఉమేష్ యాదవ్ - 4.20 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
అజింక్యా రహానే - 4.00 - రాజస్థాన్ రాయల్స్
హర్భజన్ సింగ్ - 2.00 - కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
యువరాజ్ సింగ్ - 2.00 - కింగ్స్ ఎలెవెన్ పంజాబ్

More Telugu News