chiranjeevi: 'సైరా' గెటప్ లో ఆకట్టుకుంటోన్న సురేందర్ రెడ్డి తనయుడు

  • 'సైరా' తొలి షెడ్యూల్ పూర్తి 
  • ఈ సినిమాలో చిరూ వేషధారణ ప్రత్యేకం
  • అలాంటి డ్రెస్ కావాలన్న సురేందర్ రెడ్డి తనయుడు

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి ప్రత్యేకమైన.. ఆకర్షణీయమైన వేషధారణలో కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో 'సైరా' గెటప్ లో ఓ బుడతడి ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

'సైరా' గెటప్ లో ఆకట్టుకుంటోన్న ఈ సిసింద్రీ ఎవరో కాదు .. ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి తనయుడు. 'సైరా' షూటింగ్ సమయంలో చిరూ గెటప్ చూసిన ఈ కుర్రాడు .. తనకి కూడా అలాంటి డ్రెస్ కావాలని మారాం చేశాడట. దాంతో తనయుడి ముచ్చట తీర్చడం కోసం సురేందర్ రెడ్డి అలాంటి కాస్ట్యూమ్స్ ను సిద్ధం చేయించాడట. ఆ డ్రెస్ వేసుకుని ఈ బుడతడు ఇచ్చిన స్టిల్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.    

More Telugu News