GST: రాంగోపాల్ వర్మకు పోటీగా కాకినాడ కుర్రాడి 'మేల్ పాల్కోవా'.. సోషల్ మీడియాలో వైరల్!

  • పోర్న్ స్టార్ మియా మాల్కోవాను హీరోయిన్ గా పెట్టి జీఎస్టీ తీసిన రాంగోపాల్ వర్మ
  • యువకుడ్ని హీరోగా పెట్టి పోస్టర్ డిజైన్ చేసిన సూర్య అకొండి
  • సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మాల్కోవాను ప్రధానపాత్రధారిగా పెట్టి, 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' పేరిట ఓ చిత్రం రూపొందించి ఆన్ లైన్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ 'జీఎస్టీ' సినిమాకు కౌంటర్ గా కాకినాడకు చెందిన సూర్య అకొండి అనే యువకుడు ‘జంట్స్ సెక్స్ అండ్ ట్రూత్’ అంటూ ఓ పోస్టర్‌, ట్రైలర్‌ ను విడుదల చేశాడు.

వర్మ జీఎస్టీ తరహాలోనే ఇతను కూడా పోస్టర్, ట్రైలర్లు డిజైన్ చేయడం విశేషం. మియా మాల్కోవాను ప్రధాన ప్రచారాస్త్రంగా వర్మ వాడడంతో సూర్య... మేల్ పాల్కోవాను ప్రచారాస్త్రంగా వాడుకున్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగ్నంగా కూర్చున్న మాల్కోవా ప్లేస్‌ లో యువకుడు నగ్నంగా కూర్చుండగా, వర్మ స్థానంలో సూర్య కూర్చుని పోస్టర్ లో కనిపిస్తాడు. మక్కీకి మక్కీ కౌంటర్ గా రూపొందించిన ఈ ట్రైలర్ కు వర్మ స్టైల్ లోనే వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఇది వాట్స్ యాప్, ఫేస్ బుక్ లలో వైరల్ అవుతోంది. 

More Telugu News